Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో టికెట్ రేట్ల పెంపు జీవో జారీ

ఏపీలో టికెట్ రేట్ల పెంపు జీవో జారీ
X

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం మూవీ విడుదల కు అంతా సిద్ధం అయింది. ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఒక రోజు ముందే అంటే డిసెంబర్ నాలుగున ఈ సినిమా ప్రియమిర్ షోస్ వేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు జీవో జారీ చేసింది. దీని ప్రకారం డిసెంబర్ నాలుగున వేసే ప్రీమియర్ షోస్ టికెట్ ధరలు ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు. రెగ్యులర్ షోస్ కు మాత్రం సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు..మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయల మేర టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. ఈ పెరిగిన టికెట్ రేట్లు మొత్తం పది రోజుల పాటు అమల్లో ఉంటాయని జీవో లో పేర్కొన్నారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించటంతో ..ఇప్పుడు అఖండ 2 లో మ్యూజిక్ ఎలా ఉందో అన్న ఆసక్తి బాలకృష్ణ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇటీవలే ఒక ఈవెంట్ లో మాట్లాడిన థమన్ అందరూ మ్యూజిక్ బాక్స్ లు సిద్ధం చేసుకుని ఉండాలని కామెంట్ చేసి అంచనాలు మరింత పెంచారు అనే చెప్పాలి. తెలంగాణాలో కూడా ప్రీమియర్ షోస్ తో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వచ్చే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్ చెపుతోంది.

Next Story
Share it