Telugu Gateway
Andhra Pradesh

ఏపీ లో సర్కారు యాడ్స్ అన్నీ ఇక ఒక్క సాక్షి కేనా?!

ఏపీ లో సర్కారు యాడ్స్ అన్నీ ఇక ఒక్క సాక్షి కేనా?!
X

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి అయన ఫ్యామిలీ కి చెందిన పత్రిక సాక్షి తో పాటు సాక్షి టీవీ కి కూడా యాడ్స్ పంట పండుతోంది. కొద్ది రోజుల క్రితం ఆర్ టిఐ కింద వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం చూసినా కూడా వందల కోట్ల రూపాయల యాడ్స్ ఆ పత్రికకు దక్కాయి ఈ నాలుగేళ్లలో. రాష్ట్రంలో టాప్ త్రీ తెలుగు పేపర్స్ అంటే ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జగన్ సీఎం అయిన తొలిరోజు నుంచి ఆంధ్ర జ్యోతి పత్రికకు యాడ్స్ పూర్తి గా నిలిపివేశారు. నిన్న మొన్నటి వరకు సాక్షి తో పాటు ఈనాడుకు కూడా ప్రతి యాడ్ ఇచ్చుకుంటూ వచ్చారు.కానీ మే నెలలోనే రెండు జాకెట్ యాడ్స్ తెలుగు లో ఒక్క సీఎం ఫ్యామిలీ పేపర్ సాక్షి కి మాత్రమే దక్కాయి. అందులో ఒకటి వాలంటీర్స్ అవార్డు ల కార్యక్రమానికి సంబందించినది..తాజాగా మచిలీపట్నం పోర్టు శంఖుస్థాపన యాడ్. ఈ రెండు యాడ్స్ తెలుగు లో టాప్ త్రీ పేపర్స్ లో ఒక్క సాక్షి కి మాత్రమే ఇచ్చారు. అంటే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సాక్షి కి తప్ప మెయిన్ పేపర్స్ కు యాడ్స్ ఇవ్వరా అనే చర్చ సాగుతోంది. గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ వై ఎస్ జగన్ సర్కార్ వెర్సస్ ఈనాడు అన్న తరహాలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం మార్గదర్శి పై కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా అన్నట్లు ఈనాడు కు యాడ్స్ నిలిపివేశారు.

సాంకేతికంగా చూసినా ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నంబర్ వన్ పేపర్ గా ఉంది అని..అలాంటిది ఆ పేపర్ ను వదిలేసి సీఎం జగన్ ఫ్యామిలీ పేపర్ ఒక్క సాక్షి కి మాత్రమే యాడ్స్ ఇవ్వటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రచారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ నేతలు, సీఎం జగన్ ఇప్పుడు ఆయన్ను మించి ప్రచారం చేసుకుంటున్నారు అని ఒక ఐఏఎస్ అభిప్రాయపడ్డారు. అసలు సాక్షి పత్రికకు యాడ్స్ ఇవ్వటానికే జగన్ సర్కారు స్కీం లు డిజైన్ చేసినట్లు ఉంది అని మరో ఐఏఎస్ వ్యాఖ్యానించారు. వంద కోట్ల రూపాయల కార్యక్రమానికి కూడా ఒక్కో సారి ఐదు కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క సాక్షి కి యాడ్స్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు జగన్ ఆంధ్ర జ్యోతికి నాలుగేళ్లుగా యాడ్స్ అపి..ఇప్పుడు ఈనాడుకు కూడా ఆపేసారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చే యాడ్స్ లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరుగుతోంది అని సమాచార శాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఒక వైపు ప్రతినెలా సర్కారు ముందుకు సాగటం కోసం అప్పులు చేస్తూ సొంత పత్రిక కు యాడ్స్ మాత్రం కుమ్మేస్తున్నారు ...ఎవరైనా ఒక స్కీం కొత్తగా ప్రారంబించిప్పుడు యాడ్ ఇస్తారు..కానీ ఏపీ లో మాత్రం విడత విడతకు యాడ్స్ తో సొంత ఖజానా నింపుకుంటున్నారు అనే విమర్శలు జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.

Next Story
Share it