జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ
BY Admin8 Jan 2021 5:00 PM IST

X
Admin8 Jan 2021 5:00 PM IST
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం నాడు తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి..ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో వీరిద్దరి భేటీకి కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ తోపాటు పలు రాష్ట్రాల్లో తన సేవలు అందిస్తున్నారు.
Next Story