తక్షణమే ఏపీకి 2250 కోట్లు మంజూరు చేయాలి
భారీ వర్షాలు..వరదలతో ఏపీలో 4450 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో నిర్ధారించారు. తక్షణ సాయం కింద 2250 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ కష్ట కాంలలో కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలని జగన్ కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్ షా దృష్టికి తీసుకుపోయారు.
వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయని. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయన్నారు. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని తెలిపారు. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయని తన లేఖలో ప్రస్తావించారు.