Telugu Gateway
Andhra Pradesh

మాజీ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

మాజీ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడికి అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ఈ సోదాలు సాగాయి. నోటీసులు లేకుండా సోదాలు ఎలా చేస్తారంటూ తొలుత ల‌క్ష్మీనారాయ‌ణ, ఆయ‌న కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత సీఐడీ అధికారులు ఇంట్లోకి ప్ర‌వేశించి సోదాలు ప్రారంభించారు. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో భాగంగా ఈ విచార‌ణ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

గతంలో ఆయన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో సలహాదారుగా పనిచేశారు. తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో.. లక్ష్మినారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని పలు అభియోగాలు నమోదయ్యాయని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్మినారాయణ 242 కోట్ల రూపాయ‌ల నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింద‌నేది అదికారుల వాద‌న‌. తెలుగుదేశంలో హ‌యాంలో జ‌రిగిన ప‌లు అక్ర‌మాలు..అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఏపీ స‌ర్కారు విచార‌ణ‌లకు ఆదేశించింది.

Next Story
Share it