Telugu Gateway
Andhra Pradesh

అమరావతి గ్యాలరీ డ్యామేజ్

అమరావతి  గ్యాలరీ డ్యామేజ్
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గ్యాలరీ ధ్వంసం అయింది. ప్రధాని మోడీ అమరావతికి శంఖుస్థాపన చేసిన ప్రాంతంలో రాజధాని నమూనా గ్యాలరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొత్తగా కట్ట ప్రతిపాదించిన రాజధాని ఎలా ఉండబోతుందో నమూనాలు, మ్యాప్ లు, కట్టడాలు ఎలా ఉంటాయో చూపిస్తూ పలు నమూనాలను ఈ గ్యాలరీలో పెట్టారు. వీటిని గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం. ఈ పరిణామంపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతి అంశాన్ని పక్కన పెట్టి మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే.

దీంతో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు అనే చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ మూడు ప్రాంతాల సమ న్యాయం కోసం మూడు రాజధానులు అంటుంటే ...ప్రతిపక్ష తెలుగు దేశం తో పాటు జన సేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఒకే రాజధాని అమరావతి కే కట్టుబడి ఉన్నట్లు చెపుతున్నాయి.

Next Story
Share it