Telugu Gateway
Andhra Pradesh

అల్లు అర్జున్ సీడీపీ విడుదల

అల్లు అర్జున్ సీడీపీ విడుదల
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8. దీంతో ఆయన ఫ్యాన్స్ పుష్ప అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన పరిచయ వీడియోను విడుదల చేయనుంది. ఇప్పటికే శాంపిల్ చూపించారు. దీంతోపాటు మంగళవారం నాడు అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్‌ డీపీని రిలీజ్‌ చేశారు. ఇందులో బన్నీ లుక్ అదిరిపోగా ఓ సందేశాన్ని కూడా ప్రజలకు చేరవేశారు.

"సర్వ శిక్షా అభియాన్‌.. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి"'గో గ్రీన్‌ విత్‌ అల్లు అర్జున్‌' అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఇక ఈ సీడీపీని సుమారు 46 మంది నటీనటులు విడుదల చేయటం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. అల...వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా ఇదే కావటంతో అందరిలో ఎంతో ఉత్సుకత ఉంది.

Next Story
Share it