తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బాధితులు, రైతులను పరామర్శించే కార్యక్రమం తలపెట్టారు. తన పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ట్రాక్టర్ నడిపారు. అయితే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి ఒరిగింది.
దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్‌ను అదుపు చేసి లోకేష్‌ను కిందకు దించారు. మరో ట్రాక్టర్ ను తెప్పించి పర్యటన కొనసాగించారు. తర్వాత ఆకివీడులో పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడి సాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా లోకేష్ పంటలతోపాటు ఆక్వా చెరువులను కూడా పరిశీలించారు.