కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అంతర్జాతీయ నాయకుడు అయితే దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్లు వచ్చేలా చూసుకోమని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం నాడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్. ఆయన మళ్ళీ బిజెపిలోకి వెళతారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఇది తాను అంటున్న మాట కాదని..వింటున్న మాట అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.