దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం

Update: 2020-10-26 14:03 GMT

రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం

కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు

ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో సోదాలు సాగాయి. రఘునందన్ రావు మామ ఇంట్లో పోలీసులు 18.65 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత మొత్తాన్ని బిజెపి కార్యకర్తలు బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారు. తమ బంధువుల ఇళ్ళలో సోదాల విషయం తెలుసుకున్న బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు అక్కడకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు జమకావటం, పోలీసులతో ఘర్షణలో రఘునందన్ రావు సొమ్మసిల్లి కిందపడిపోయారు. టీఆర్ఎస్ కు చెందిన సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు ఇంట్లోనూ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ ఉప ఎన్నిక గతంలో ఎన్నడూలేని రీతిలో హోరాహోరీగా సాగుతోంది. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల మధ్యే ఉన్న విషయం తెలిసిందే. బిజెపి కూడా దుబ్బాక ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార టీఆర్ఎస్ కూడా ప్రధానంగా కాంగ్రెస్ కంటే బిజెపిపైనే ఫోకస్ ఎక్కువ పెట్టింది. బిజెపి సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. కావాలనే బిజెపిని టార్గెట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. నోటీసులు లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News