ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెన్నయ్ లో కొత్త ప్యాలెస్ కడుతున్నారని..కేసుల కోసమే పోలవరం విషయంలో రాజీపడ్డారంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లోకేష్ కు తగిన బుధ్ధి చెబుతాం అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. లోకేష్ కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్ బాగ్ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబుది అని, ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారు. అప్పుడు బషీగ్ బాగ్ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదని ప్రశ్నించారు.
గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. లోకేష్ ఎక్కడ తిరిగినా ఏమీ ఉపయోగం ఉండదన్నారు. మరో మంత్రి అనిల్ మాట్లాడుతు చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తి వల్లే పోలవరం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుందని అనిల్ ఆరోపించారు. జగన్ గురించి లోకేష్ ఇష్టానుసారం మాట్లాడితే సహించేదిలేదన్నారు. జగన్ సొంత కష్టంతో పార్టీని అధికారంలోకి తెచ్చారని..చంద్రబాబు, లోకేష్ లా దొడ్డిదారిన రాలేదని విమర్శించారు.