టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని గతంలో కెసీఆర్ చెప్పిన అంశాన్ని రేవంత్ గుర్తు చేశారు. వేల కోట్లు దోచుకోమని, ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇవ్వమని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందో చెప్పాలని ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే తొలిస్థానం భూపాలపల్లి అని రేవంత్‌రెడ్డి అన్నాడు. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సింగరేణిని బొందలగడ్డగా మార్చారని మండిపడ్డారు. 1200 మంది అమరులైంది కేసీఆర్ కుటుంబం కోసమేనా?అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు ఇక కాలం చెల్లిందని మండిపడ్డారు.కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటామని, కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంట్టామని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సమక్షంలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భూపాలపల్లి ప్రజలను నమ్మించి మోసం చేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి ఇదే చివరి ప్రజా జీవితం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గండ్రకు మరణశాసనం రాయబోతున్నారని తెలిపారు. కెసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతోందని విమర్శించారు.