ప్రేమ‌లేఖ‌లు అందాయ‌న్న శ‌ర‌ద్ ప‌వార్

Update: 2022-07-01 06:05 GMT

ప్ర‌భుత్వం మారింది. నోటీసుల వార్ షురూ అయింది. ఇప్ప‌టికే శివ‌సేన నేత‌, ఎంపీ సంజ‌య్ రౌత్ కు ఈడీ నోటీసులు జారీ చేయ‌గా..రాత్రికి రాత్రి ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కు ఐటి నోటీసులు అందాయి. అలా కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిందో లేదో..ఇలా కొత్త నోటీసులు జారీ చేయ‌టంపై ఎన్సీపీ మండిప‌డుతోంది. ఐటి నోటీసుల‌ను ఉద్దేశించి ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్రేమ‌లేఖ‌లు వ‌చ్చాయంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాను వాటికి ఏమీ భ‌య‌ప‌డ‌టంలేద‌ని..త‌న ద‌గ్గ‌ర అన్ని లెక్క‌లు ప‌క్కాగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌ర‌ద్ ప‌వార్ త‌న ఎన్నిక‌ల అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల, ఆదాయం పై ఈ నోటీసులు జారీ చేసినట్లు స‌మాచారం.

ఈ నోటీసుల‌పై స్పందించిన శ‌ర‌ద్ ప‌వార్ ఆదాయపు పన్ను శాఖ నోటీసుల విషయమై నాకు ప్రేమ లేఖ అందిందన్నారు. ఇది 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించి 'ప్రేమలేఖ' అని వ్యాఖ్యానించారు. ఈ విభాగం గత కొద్ది సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం సమర్థవంతంగా పనిచేయడంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది కూడా. బహుశా తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడం పై దృష్టి పెట్టడం ఒక వ్యూత్మాకమైన మార్పు కాబోలు" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News