మేమే గెలుస్తాం ..బైడెన్

Update: 2020-11-04 08:52 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వగా..డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ సైతం తామే గెలువబోతున్నట్లు ప్రకటించారు. ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ట్రెండ్ లు చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం' అంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు.

మిషిగాన్‌, విస్కాన్సిన్‌లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ‌ ఆధిక్యతలు తగ్గిపోతాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమొక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలువబోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బైడెన్‌ 238, ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు.

Tags:    

Similar News