తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు పంపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జెఏసీ ని ఏర్పాటు చేయాలని గంటా శ్రీనివాసరావు ప్రతిపాదించారు.
గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు రాజకీయంగా మౌనాన్ని ఆశ్రయిస్తూ వస్తున్నారు. కొద్ది కాలం క్రితం ఆయన అధికార వైసీపీలో చేరతారని బలంగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి పలు ముహుర్తాలు కూడా ఖరారు అయ్యాయి. కారణాలేంటో తెలియదు కానీ..అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంతో అకస్మాత్తుగా ఆయన తెరపైకి వచ్చారు. అయితే గంటా రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో లేదని..దీంతో ఇది ఆమోదం అనుమానమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.