ఒకే ఒక ఉప ఎన్నిక. కానీ ఎక్కడ లేని ఉత్కంఠ. అందరి కళ్ళు దుబ్బాక నియోజకవర్గంవైపే. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ లకు ఓ పెద్ద పరీక్ష. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే సీటు ఇఛ్చింది. బిజెపి తరపున రఘనందన్ రావు, కాంగ్రెస్ తరపున చెరకు శ్రీనివాసరెడ్డిలు బరిలో ఉన్నారు.
ప్రధాన పోటీ ఈ ముగ్గురి మధ్యే అన్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. నవంబర్ 3న ఎన్నిక, 10న పలితాలు వెల్లడికానున్నాయి. అసలైన తెరవెనక రాజకీయం ఇప్పుడే మొదలైంది. లక్షా 98 వేల ఓటర్లు ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో పోరు హోరాహోరీ గా ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ గెలుపుపై ఎవరి ధీమాతో వారు ఉన్నారు.