ట్రంప్ రాజకీయ సంక్షోభం సృష్టించే ఛాన్స్

Update: 2020-11-04 11:41 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు కౌంటింగ్ కొనసాగుతుండగానే తాను గెలిచినట్లు ట్రంప్ ప్రకటించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ కంటే ట్రంప్ వెనకబడి ఉన్నారు. అయినా సరే ఆయన మాత్రం విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వటం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు ఓట్ల లెక్కింపును నిలిపివేయాల్సిందిగా సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించి కలకలం రేపారు.

పోస్టల్ బ్యాలెట్లను అనుమతించటాన్ని ఆపివేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై జో బైడెన్ టీమ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ ప్రయత్నాలను ప్రతిఘటించటానికి తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ చేసిన గెలుపు ప్రకటనను జర్మనీ రక్షణ శాఖ మంత్రి అన్నెగ్రాట్ క్రాంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఫలితాలు రాక ముందే ఇలా ప్రకటన చేయటం సరికాదన్నారు. చూస్తుంటే ట్రంప్ అమెరికాలో రాజకీయ సంక్షోభం అవకాశం ఉందని హెచ్చరించారు.

Tags:    

Similar News