మన సీఎం ఎవరంటే ఎడమ కాలి చెప్పు అని చెప్పండి

Update: 2021-02-19 04:18 GMT
మన సీఎం ఎవరంటే ఎడమ కాలి చెప్పు అని చెప్పండి
  • whatsapp icon

ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికార టీఆర్ఎస్ విషయంలో యమా దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ పై విమర్శల విషయంలో ఆయన ముందు వరసలో ఉంటున్నారు. అయితే ఈ విమర్శలకు టీఆర్ఎస్ కూడా పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ ఇస్తోంది. అయితే అరవింద్ మాత్రం తన పదునైన విమర్శలతో బిజెపిలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం నాడు జగిత్యాల జిల్లా కోరుట్ల నియెజకవర్గంలో పర్యటించారు.

ఈ పర్యటనలో మాట్లాడుతూ ఎవరైనా 'మన సీఎం ఎవరని అడిగితే.. ఇప్పటి నుంచి ఎడమ కాలి చెప్పు' అని చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్‌కు ఇద్దరు పెళ్లాలని.. ఒకరు టీఆర్‌ఎస్‌ అయితే, మరొకరు కాంగ్రెస్‌' అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో సీఎం కెసీఆర్ మాట్లాడుతూ సీఎం పదవి తనకు ఎడమ కాలి చెప్పుతో సమానం అని వ్యాఖ్యనించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

Tags:    

Similar News