తెలంగాణలో కలకలం. మావోయిస్టులు అధికార టీఆర్ఎస్ నేతను దారుణంగా హత్య చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బీమేశ్వర్ రావుని శనివారం రాత్రి హత్య చేసిన మావోయిస్టులు, ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి తుపాకీ కాల్చేందుకు యత్నం చేశారు. అది కుదరక పోవడం తో కత్తితో దాడి చేసి హత్య చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. సంఘటనా స్థలంలో మావోయిస్టుల లేఖ దొరికింది. ఈ హత్య ఘటనలలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు మృతురాలి భార్య చెబుతున్నారు.
అధికార పార్టీలో ఉంటూ అమాయకప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. తెరాస- బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పట్టుద్దని హెచ్చరికలు జార చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.