టీవీ5పై వైసీపీ నిషేధం

Update: 2019-03-08 06:36 GMT

వైసీపీ నిషేధ జాబితాలో మరో ఛానల్ చేరింది. ఇప్పటికే తమ పార్టీ కార్యక్రమాలకు ఏబీఎన్ పై వైసీపీ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగుదేశం పార్టీని భుజానమోసే స్థితి నుంచి నెత్తికెక్కించకుని వార్తా ప్రసారాలు..టీవీ చర్చలు సాగిస్తున్న టీవీ5 ఛానల్ చర్చలకు వైసీపీ నుంచి ఎవరూ హాజరుకారని..తమ పార్టీ నేతలను చర్చలకు ఆహ్వానించవద్దని కోరింది. పార్టీ ప్రెస్ మీట్లు..కార్యక్రమాల కవరేజీకి టీవీ5ని నిషేధించినట్లు పేర్కొన్నారు.

Similar News