టీడీపీకి వరస షాక్ లు!

Update: 2019-02-14 09:05 GMT

అధికార తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడి ఒక్క రోజు కూడా కాక ముందే మరో ఎంపీ కూడా అదే బాట పట్టడానికి రెడీ అయిపోయారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పటానికి రెడీ అయిపోయారు. ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోవటంతో ఈ అనుమానం మరింత బలపడింది. గత కొంత కాలంగా ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ సారి పార్టీ మార్పు వార్తలను ఆయన ఖండించారు కూడా.

కాకపోతే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం అయిందని చెబుతున్నారు. ఏ క్షణంలో అయినా ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అవంతితో పాటు...మరి కొంత మంది సీనియర్ నేతలు వైసీపీలోకి వెళ్ళటానికి రెడీ అయ్యారని చెబుతున్నారు. ఈ చేరికలు ఇలా కొనసాగితే రాజకీయంగా అది టీడీపీకి నష్టం చేయటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఈ సారి ఎమ్మెల్యే బరిలో నిలవాలని ఆశిస్తున్నారు.

 

Similar News