వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ఇంట్లోకి ప్రవేశించటానికి రెడీ అయిపోయారు. కొత్త ఇంటితోపాటు..అమరావతిలో కొత్త పార్టీ ఆఫీస్ కూడా ఇఫ్పటికే సిద్ధం అయింది. పాదయాత్రతో ఏడాదికిపైగా ప్రజల మధ్యే తిరిగిన జగన్ ఇక తన రాజకీయ కార్యక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అమరావతికి షిఫ్ట్ చేయటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు జగన్ నివాసంతో పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా అమరావతిలోనే సిద్ధం అయింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి లో సుమారు ఎకరం స్థలంలో నిర్మించిన కొత్త ఇళ్లు, పార్టీ ఆపీసులోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయను న్నారు. అదే రోజు నూతన కేంద్ర కార్యాల యాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని వైసీపీ నేతలందరినీ ఆహ్వానించారు.ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ సోమవారం అర్థరాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.