అశోక్ గజపతిరాజు..ఎందుకలా?!

Update: 2019-02-24 12:04 GMT

టీడీపీలో నిక్కచ్చిగా ఉంటే నేతల్లో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ముందు వరసలో ఉంటారు. ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండగానే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లు ఖరారు అయ్యాయి. ఆయన శాఖ పరిధిలోని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి టెండర్ దక్కింది. అయినా సరే సీఎం చంద్రబాబు ఐఐఏకి టెండర్ ఇవ్వటం వల్ల ఎలాంటి ముపుడులు రావని భావించి ఏకంగా టెండర్ నే రద్దు చేశారు. ఇది కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజును అవమానించినట్లే?. తర్వాత ఏకంగా టెండర్ నిబంధనల్లో ఏఏఐ పాల్గొనే అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు.

అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విమానాశ్రయాన్ని ఎవరు నిర్మిస్తారో తేల్చకుండానే సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం మాత్రం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టారు. తర్వాత పొలిట్ బ్యూరోకి కూడా హాజరుకాకపోవటంతో దుమారం రేగింది. తాజాగా అమరావతి కేంద్రంగా చంద్రబాబు సమక్షంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరికకు ఆయన దూరంగా ఉన్నారు. ఇది టీడీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపట్ల గజపతిరాజు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

 

 

 

Similar News