తెలుగుదేశం ఎంపీ టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తును ఆయన ధృవీకరించారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని..అంతకు మించి చర్చించటానికి రెండు పార్టీల మధ్య ఏమి ఉంటాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు ఏమీ లేవన్నారు. కేవలం కేంద్రం పై పోరాటం చేసే విషయం లోనే విభేదాలున్నాయని పేర్కొన్నారు.
పవన్ కి కుర్చీ పై ఆశ లేదు అని గతంలో చాలాసార్లు చెప్పారు కదా అని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఎస్పీ , బిఎస్పీ కలిసినప్పుడు టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటి? అని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. జనసేన టీడీపీ కలిసేందుకు. అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు గెలిచేవాళ్లకే అవకాశాలు ఇస్తారు, తన కుమారుడికి కూడా అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.