ప్రియాంకకు మంచి భవిష్యత్

Update: 2019-01-26 06:04 GMT

ఈ మాట అన్నది ఎవరో మిత్రపక్ష పార్టీ కాదు. శివసేన. గత కొంత కాలంగా శివసేన తన మిత్రపక్షం బిజెపిపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసిస్తోంది. తాజాగా శివసేన పత్రిక సామ్నాలో ప్రియాంకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే ప్రియాంక పార్టీలో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే చిక్కుల్లో ఉన్న మోడీ సర్కారును ‘రాఫెల్’ఫై విమర్శల ద్వారా రాహుల్ గాంధీ మరింత ఆత్మరక్షణలో పడేశారని శివసేన వ్యాఖ్యానించటం విశేషం.

 

 

Similar News