రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి ఖరారు

Update: 2018-09-06 11:17 GMT

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఒకేసారి 105 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ జాబితాలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి ఖరారు అయ్యారు. రేవంత్ రెడ్డి మీద మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేంద్ర రెడ్డి పోటీచేయనున్నారు.నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు. రేవంత్ పై నరేంద్ర రెడ్డి గట్టి పోటీ అవుతారని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

మహేందర్ రెడ్డి తాండూరు నుంచి పోటీచేస్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి గజ్వేల్ నుంచి పోటీచేస్తారు. ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్ సిరిసిల్ల నుంచి , మేనల్లుడు, మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి పోటీచేస్తారు. పౌరసత్వం వివాదంలో ఉన్న చెన్నమనేని రమేష్ కు వేముల వాడ టిక్కెట్ ను మళ్లీ ఇచ్చారు.స్పీకర్ మదుసూదనాచారి మళ్లీ భూపాలపల్లి నుంచి పోటీచేస్తారని తెలిపారు.

 

 

Similar News