డీఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్

Update: 2018-08-28 05:18 GMT

డీఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ అధినేత కరుణానిధి మృతితో ఈ ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల వరకూ స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు. స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డీఎంకెలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి ఉన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల డీఎంకె చరిత్రలో ఇది మూడవ అధ్యక్ష ఎన్నిక కావటం విశేషం.

డీఎంకె కోశాధికారిగా దురైమురుగన్ ఎన్నికయ్యారు. కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్టాలిన్ అన్న అళగిరి ఇప్పుడు పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. తనను పార్టీలో చేర్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యను స్టాలిన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

 

 

Similar News