Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్...కొమరం భీమ్ అప్ డేట్ అక్టోబర్ 22న

ఆర్ఆర్ఆర్...కొమరం భీమ్ అప్ డేట్ అక్టోబర్ 22న
X

ఆర్ఆర్ఆర్ అప్ డేట్ వచ్చేసింది. చిత్ర యూనిట్ షూటింగ్ ప్రాంభించిన వీడియోను విడుదల చేసింది. ఆరు నెలలు ఆగిపోయిన షూటింగ్ ను ‘దుమ్ముదులిపి’ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ అత్యంత కీలకమైన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇఫ్పటికే అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సంబంధించిన పాత్ర లుక్ ను చూపించిన దర్శకుడు రాజమౌళి అక్టోబర్ 22న కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టిన రోజునే ఈ అప్ డేట్ వస్తుందని ఆశించినా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ‘విశ్రాంతి, పునరుత్తేం..ఉత్సాహంతో ముందుకు అంటూ #we RRR back’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఈ సినిమాలో అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంటే...ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కావటంతో ఈ సినిమా విడుదల వచ్చే వేసవిలో ఉండే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచిచూడాల్సిందే. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది.

https://www.youtube.com/watch?v=Fbbw0HQUwds&feature=emb_logo

Next Story
Share it