Telugu Gateway
Cinema

మంచు విష్ణు సినిమాలో డొనాల్డ్ ట్రంప్

మంచు విష్ణు సినిమాలో డొనాల్డ్ ట్రంప్
X

అవును. మీరు చదువుతున్నది నిజమే. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నన సినిమానే ‘మోసగాళ్ళు’. ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ శనివారం నాడు విడుదల చేశారు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు చెబుతోంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే 450 మిలియన్ డాలర్ల భారీస్కాంలో నేరస్థుల్ని పట్టుకుంటాం.. అంతం చేస్తాం..అవసరమైన చర్యల్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో టీజర్ మొదలవుతోంది.

ఆ తర్వాతే మంచు విష్ణు, కాజల్ ఎంట్రీ ఇస్తారు. ఓ పాడుబడ్డ గోడౌన్ లో బస్తాలకు బస్తాల కరెన్సీ కట్టలను చూపిస్తూ ఇది సరిపోతుందిగా అని కాజల్ అగర్వాల్ ప్రశ్నిస్తే..ఆట ఇప్పుడే మొదలైంది అంటూ మంచు విష్ణు డైలాగ్ తో టీజర్ ను ముగించారు. జెఫ్రీ గీ చిన్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్. రుహి సింగ్, కర్మ మెక్కెయిన్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=F8awPo7DiOA&feature=emb_logo

Next Story
Share it