Telugu Gateway
Cinema

కాజల్ పెళ్లి అక్టోబర్ 30న..ముంబయ్ లో

కాజల్ పెళ్లి అక్టోబర్ 30న..ముంబయ్ లో
X

కాజల్ ఫెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్30న..ముంబయ్ లో పెళ్ళి జరగనుంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో అతిధుల మధ్యే ఈ వేడుక జరగనుందని కాజల్ ఓ ప్రకటనలో తెలిపింది. పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను ఆమె పెళ్లాడనుంది. కొత్త జీవితం ప్రారంభించటానికి ఎంతో ఉత్సాహంతో..ఆనందంతో ఉన్నట్లు కాజల్ తెలిపారు. ఇన్ని సంవత్సరాలపాటు తనపై అభిమానం కురిపించిన వారందరికీ కాజల్ ధన్యవాదాలు తెలిపారు. పెళ్ళి తర్వాత కూడా తాను ఎంచుకున్న మార్గంలో తన అభిమానులను సంతోషపర్చే పనులు చేస్తానన్నారు.

టాలీవుడ్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాన్‌, ఎన్టీఆర్‌​, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో నటించి అగ్ర స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం కాజల్ చేతిలో పలు ప్రాజెక్ట్‌ లు ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.

Next Story
Share it