వంశీతో కలసి పనిచేయటం కుదరదు
BY Telugu Gateway4 Oct 2020 7:52 PM IST
X
Telugu Gateway4 Oct 2020 7:52 PM IST
గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఘర్షణలపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు.
గన్నవరం వైసీపీలో తనకు గ్రూపులు లేవన్నారు. ఎమ్మెల్యే వంశీతో కలిసి పని చేయనని సీఎం జగన్‌కు చెప్పానని స్పష్టం చేశారు. వంశీ తనను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని, ఆయన వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని తెలిపారు. పలు గ్రామాల్లో తన జన్మదిన వేడుకలు జరపవద్దని ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఇటీవలే మరో నేత దుట్టా..వంశీ వర్గీయుల ఘర్షణ పడిన విషయం తెలిసిందే.
Next Story