Telugu Gateway
Cinema

ప్రభాస్ సినిమాలో అమితాబచ్చన్

ప్రభాస్ సినిమాలో అమితాబచ్చన్
X

ప్రభాస్, దీపికా పడుకొణె జంటగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్ కూడా నటించనున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మహానటి వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పడుకొణెలకు తోడుగా ఇప్పుడు అమితాబచ్చన్ కూడా తోడవ్వటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. దీపికా పడుకొణె తెలుగులో చేతున్న పూర్తి స్థాయి తొలి చిత్రం ఇదే. కరోనా భయం వీడి టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు.పాన్ ఇండియా సినిమాగా ఈ కొత్త మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందుకే అమితాబచ్చన్ తోపాటు దీపికా పడుకొణె వంటి బాలీవుడ్ నటులపై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.

Next Story
Share it