Telugu Gateway
Politics

వైసీపీకి మద్దతిచ్చి రాజీనామా చేయకపోవటం ఏంటి?

వైసీపీకి మద్దతిచ్చి రాజీనామా చేయకపోవటం ఏంటి?
X

వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఆయన రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. మాజీ మంత్ర గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీకి వెళ్ళాలన్నది వారి వ్యక్తిగతం అని..పార్టీ మారిన వాళ్లు రాజీనామా చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. విష్ణుకుమార్ రాజు గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. మంత్రి కొడాలి నాని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణం అని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. యోగికి... కొడాలి నానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ మెప్పు కోసమే కొడాలి నాని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ పై జగన్‌కు ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మంత్రి వర్గం నుంచి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని మత్తులో ఉన్నారని..ఆ మత్తుని జగనే ఆ మత్తును వదిలించాలి అంటూ సీఎంను కోరారు.

Next Story
Share it