వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘వకీల్ సాబ్‘ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. వాస్తవానికి గత వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ లో లాయర్ లో లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ చేతిలో కర్ర...మరో చేతిలో క్రిమినల్ లా పుస్తకం చేతిలో పట్టుకుని కన్పిస్తారు.
సత్యమేవ జయతే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ కన్పించే సమయంలో ఐపీసీలోని పలు సెక్షన్లకు సంబంధించి పేజీలు అలా ఎగురుతూ పడతాయి. హిందీ సినిమా పింక్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=20&v=1rcJgndYjN8&feature=emb_logo