కంగనాపై ఊర్మిళా ఫైర్
కంగనా రనౌత్ పై ఉర్మిళా మటోండ్కర్ ఫైర్ అయ్యారు. కంగనా తనేదో బాధితురాలు అన్నట్లు డ్రామాలాడుతుందని విమర్శించారు. ముంబయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా.. తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్ మాదకద్రవ్యాలకు మూలం అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా అంటూ విరుచుకుపడుతున్న కంగనా మొదట తన పోరాటాన్ని సొంత రాష్ర్టం నుంచే ప్రారంభించాలన్నారు. పెద్దగా నోరేసుకొని మాట్లాడినంత మాత్రాన ఆమె మాట్లాడేవన్నీ నిజాలు అయిపోవని వ్యాఖ్యానించారు. కంగనా డ్రగ్స్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసమో, స్వార్థ ప్రయోజనాల కోసమో ముంబయ్ ని కించపరిచేలా మాట్లాడితే తాను సహించబోనని హెచ్చరించారు.
కంగనా వ్యాఖ్యలు ముంబయ్ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. కొందరు ఎప్పటికప్పడు బాధితురాలు అన్నట్లు డ్రామాలాడుతారు. అవి విఫలమైతే మహిళా హక్కులు అంటూ విమెన్ కార్డు ఉపయోగిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. జయా బచ్చన్‌పై కంగనా వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమెదయోగ్యం కాదని, ఓ సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఊర్మిళ అన్నారు. బాలీవుడ్ గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా నిజనిజాలు మాట్లాడితే తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అని బీటౌన్ ఇండస్ర్టీ సైలంట్‌గా ఉందని తెలిపారు.