Telugu Gateway
Telangana

తెలంగాణ సచివాలయం అంచనాలు హైజంప్

తెలంగాణ సచివాలయం అంచనాలు హైజంప్
X

ఎస్ఎఫ్ టి కి నిర్మాణ వ్యయం 8842 రూపాయలు

భూమి విలువ లేకుండా..కేవలం నిర్మాణ వ్యయమే

ఆరు ఫోర్లకు 400 కోట్లు..ఏడు ఫోర్లకు 619 కోట్లు

లక్ష చదరపు అడుగులకు..ఒక్క ఫోర్ కు 219 కోట్ల పెరుగుదలా?

తెలంగాణ నూతన సచివాలయం. అసలు పనులు ప్రారంభం కాకముందే అంచనాలు హైజంప్ చేశాయి. తొలుత 400 కోట్ల రూపాయలతో అవుతుందన్నారు...ఇప్పుడు 619 కోట్ల రూపాయలకు పెంచేశారు. ఆరు ఫోర్లు..ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత పేర్కొన్నారు. కానీ ఇఫ్పుడు ఫ్లోర్ ఒకటి పెంచారు.. మరో లక్ష చదరపు అడుగులు పెంచారు. అంటే ఒక ఫ్లోర్ కు ..లక్ష చదరపు అడుగులకు ఏకంగా అంచనా వ్యయం 219 కోట్ల రూపాయల మేర జంప్ చేసింది. మరి ఈ అంచనాలు ఇంజనీర్లు వేస్తారో..మరెవరో వేస్తారో అర్ధం కాదు. ఒక్క భవనాలు, రోడ్లే కాదు..సాగునీటి ప్రాజెక్టులు ప్రతి దాంట్లోనూ ఇలా అంచనాలు పెరుగుతూనే ఉంటాయి.

ఇప్పుడు పనులు ప్రారంభం కాక ముందే పెరిగిన సచివాలయం అంచనాలు మాత్రం షాకింగ్ గానే ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం సచివాలయం నిర్మాణం కోసం ఒక్కో చదరపు అడుగుకు 8842 రూపాయలు అవుతుంది. భూమి సర్కారుదే. అంటే కేవలం నిర్మాణ వ్యయమే చదరపు అడుగుకు 8842 రూపాయలు అన్న మాట. ఒక్కో చదరపు అడుగుకు కేవలం నిర్మాణ వ్యయమే 8842 రూపాయల వ్యయం అంటే చాలా చాలా ఎక్కువ మొత్తం అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.కొత్తగా పెంచిన ఈ 619 కోట్ల రూపాయల అంచనా వ్యయానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందట.

Next Story
Share it