Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారు కీలక అడుగు

తెలంగాణ సర్కారు కీలక అడుగు
X

తెలంగాణాలో రెవెన్యూ సంస్కరణలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లోనే రెవెన్యూ సంస్కరణలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. అందులో భాగంగానే వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 3 గంటల కల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని..5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశించారు.

రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన అన్నారు. రికార్డుల్లో పేర్లు చేర్చాలంటే డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు. గత కొంత కాలంగా రెవెన్యూలో అవినీతి కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూశాయి.

Next Story
Share it