Telugu Gateway
Telangana

తెలంగాణలో బార్లు..క్లబ్బులకు అనుమతి

తెలంగాణలో బార్లు..క్లబ్బులకు అనుమతి
X

తెలంగాణలో బార్లు తెరుచుకోనున్నాయి. బార్లతో పాటు క్లబ్బులు ఓపెన్ చేసేందుకు సర్కారు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా బార్లు, క్లబ్బులను మూసివేసిన విషయం తెలిసిందే. అన్ లాక్ 4లో భాగంగా కేంద్రం వీటి ఓపెన్ కు అనుమతి మంజూరు చేయటంతో తెలంగాణ సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రతి బార్ లోనూ ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

దీంతోపాటు క్యూల నిర్వహణ, పరిశుభ్ర వాతావరణం ఉంచటం, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీని నియంత్రించటం, హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచటం, బార్ సిబ్బంది, ఉద్యోగులు విధిగా మాస్క్ లు ధరించాలని పేర్కొన్నారు. బార్ లో గుమిగూడటం, మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్ ఫ్లోర్లను మాత్రం నిషేధించారు. ప్రతి బారులోనూ సరైన వెంటిలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Next Story
Share it