Telugu Gateway
Telangana

వీఆర్వోల రద్దు..కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం

వీఆర్వోల రద్దు..కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం
X

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశం అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెవెన్యూ చట్టం బిల్లుతోపాటు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ (వీఆర్ వో) రద్దు బిల్లు 2020 కూడా ఉంది. వీటితోపాటు పలు బిల్లులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది.

పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును ఆమోదించింది.

తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది

తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్ మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది

ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదించింది

ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ బిల్ -2002ని ఆమోదించింది.

ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది.

టిఎస్ బిపాస్ బిల్ ను ఆమోదించింది.

తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లును ఆమోదించింది.

ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లును ఆమోదించింది

కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది

కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.

Next Story
Share it