సెప్టెంబర్ 28 వరకూ తెలంగాణ అసెంబ్లీ
BY Telugu Gateway7 Sept 2020 4:53 PM IST

X
Telugu Gateway7 Sept 2020 4:53 PM IST
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. సోమవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చచేపట్టనున్నారు. ప్రభుత్వం భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది.
సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ విపక్ష సభ్యులను కోరారు. మీడియా పాయింట్ ఎత్తివేయడంపై సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. కోవిడ్ నేపథ్యంలోనే మీడియా పాయింట్ అనుమతించలేదని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో అసెంబ్లీ బిజినెస్ జరగదు.
Next Story



