Top
Telugu Gateway

మోసాల టీఆర్ఎస్ ను నమ్మోద్దు

మోసాల టీఆర్ఎస్ ను నమ్మోద్దు
X

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ అంశంపై శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. మోసాలు చేసే టీఆర్ఎస్ ను నమ్మితే పేదలకు అన్యాయమే జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ మోసాలను ప్రతి గ్రేటర్ డివిజన్ లోనూ చెబుతామన్నారు. ‘ గ్రేటర్ సిటీ ప్రజలను ప్రతి ఎన్నికల సమయంలో మోసం చేస్తూ కేసీఆర్ నుంచి కేటీఆర్, తలసాని వరకు ఓట్లు దండుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పేదల అవసరాలను ఓట్లుగా మలుచుకొని ఎన్నికల తరువాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. లక్ష ఇళ్ళు చూపిస్తా అన్న తలసాని రెండోరోజు పర్యటన లో మధ్యలోనే మమ్ములను వదిలేసి వెళ్లారు. 2016 లో అసెంబ్లీలో కేసీఆర్- 2017 లో కేటీఆర్- 2020లో తలసాని అసెంబ్లీ లో లక్ష ఇండ్లు అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ప్రాంతంల్లో ఇళ్ళు కట్టి గ్రేటర్ సిటీ ఓట్లు దండుకున్నారు. 150 డివిజన్లలో 96వేలు ఇండ్లు ఉండాలి..కానీ ప్రభుత్వం చూపించింది 3వేల 4వందల ఇళ్లు మాత్రమే. 24 నియోజవర్గాల్లో 96వేల ఇండ్లు ఉండాలి...నాలుగు నియోజవర్గాల్లో 3వేల ఇండ్లు మాత్రమే చూపించారు.

గ్రేటర్ లోనే ఇళ్లు చూపిస్తా అన్న మంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజావర్గం లో ఉన్నవి చూపించారు. మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్ళఉ ఇప్పటివి కావు 2016లోవే---అక్కడి ప్రజల ఇండ్లను గ్రేటర్ సిటీ ఇళ్ళు అని మాయ చేస్తున్నారు. మంత్రులు తలసాని-మల్లారెడ్డి- మేయర్ బొంతు మమ్ములను వదిలేసిన ప్రాంతంలోనే 40 నిమిషాలు వేచి చూసాము మళ్ళీ వస్తారని. హైదరాబాద్ లో కేవలం 3వేల 4వందల ఇండ్లు మాత్రమే కట్టారు...1లక్ష ఇండ్లు అన్న మాట అవాస్తవం. నాలుగేళ్ళ క్రితం 150 కుటుంబాలను అంబేద్కర్ కాలనీ లో ఖాళీ చేయించారు...ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది ఆ కాలనీ అంతా. మల్లెపల్లి లో సైతం శంకుస్థాపన చేసి ఖాళీగా వదిలేశారు! నాలుగేళ్ళ నుంచి పేదల ఇబ్బందలు పట్టించుకోవడం లేదు. ’ అని తెలిపారు.

Next Story
Share it