Telugu Gateway
Cinema

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
X

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. సంచలనాల దర్శకుడు సుకుమార్..యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోమవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మించనున్న ఈ చిత్రంతో కేదార్ సెల‌గంశెట్టి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు మూవీ యూనిట్‌ ప్రకటన విడుదల చేసింది.

2022లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ‘‘నాలో ఉన్న నటుడు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇదొక గుర్తుండిపోయే సినిమా అవుతుందని హామీ ఇస్తున్నా.. సుక్కు సర్‌.. మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా’’అంటూ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.

Next Story
Share it