గేయాలను దేవతలకు విన్పించటానికి... స్వర్గానికి వెళ్లావా మహానుభావా
BY Telugu Gateway25 Sept 2020 6:22 PM IST

X
Telugu Gateway25 Sept 2020 6:22 PM IST
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత సతీష్ వేగేశ్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై స్పందించారు. ఓ చిన్న కవితను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ కవిత చదవితే బాలును అభిమానించే వారి కళ్లు చెమర్చాల్సిందే.ఆ కవిత ఇదే...
మీ గురించి రాద్ధామంటే
అక్షరాలు బాధతో కదలనంటున్నాయి
మీ గొంతులో ఇక పలకలేమని
పదాలు భోరున విలపిస్తున్నాయి
గానగంధర్వుడు పాడుతుంటే
ఇక చూడలేము అని నయనాలు
అశ్రు వర్షాన్ని కురిపిస్తున్నాయి
కోట్లాది హృదయాలకు గాయాన్ని మిగిల్చి
గేయాలను దేవతలకు వినిపించటానికి
స్వర్గానికి తరలి వెళ్లిన మహానుభావా
తెలుగుపాట ప్రతి నోటా పలికినంత కాలం
మీరు మాకు చిరంజీవులే.
Next Story