లొంగిపోయిన నిర్మాత అశోక్ రెడ్డి
BY Telugu Gateway16 Sept 2020 12:40 PM IST

X
Telugu Gateway16 Sept 2020 12:40 PM IST
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మూడో నిందితుడు అశోక్ రెడ్డి బుధవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వాస్తవానికి ఆయన సోమవారం నాడు విచారణకు వస్తానని చెప్పి..అదృశ్యం అయ్యారు. శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్ నగర్ పీహెచ్‌సీకి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అశోక్‌రెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాతగా వ్యవహరించారు.
Next Story



