కేంద్ర మాజీ మంత్రి మృతి
BY Telugu Gateway13 Sept 2020 1:35 PM IST

X
Telugu Gateway13 Sept 2020 1:35 PM IST
ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన తాజాగా ఆర్జేడీకి రాజీనామా చేశారు. బీహార్ ఎన్నికల ముందు ఇది ఆ పార్టీకి ఊహించని పరిణామంగా భావించారు. ఆయన ఎన్డీయే తీర్ధం కూడా పుచ్చుకుంటారని బలంగా ప్రచారం జరిగిది.
ఈ లోగానే ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్ వయస్సు 74 సంవత్సరాలు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
Next Story



