రియా చక్రవర్తికి బెయిల్ తిరస్కరణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ వైపు మళ్ళింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమె బెయిల్ కోసం ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సోదరుడి షోవిక్‌తో పాటు ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో ముగ్గురిని నార్కోటిక్ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. రియా బెయిల్ కోసం రెండోమరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈసారి కూడా రియాతో పాటు మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తన చేత బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, కస్టడిలో తనకు రేప్ అండ్ మర్డర్ బెదిరింపులు వస్తున్నాయని రియా బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాగే ఉంటే తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రియా ఏ నేరం చేయలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రియను ముంబైలోని బైకులా జైలులో ఉంచారు. ఆ జైలులో కేవలం రియా మాత్రమే మహిళ ముద్దాయిగా ఉన్నారు.