Top
Telugu Gateway

మై హోంపై ఎన్ జీటీలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు

మై హోంపై ఎన్ జీటీలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు
X

ప్రముఖ నిర్మాణ సంస్థలు మై హోమ్, డీఎల్ఎఫ్ లపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చెన్నయ్ లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ)లో ఫిర్యాదు చేశారు. పలు ఆధారాలతో రేవంత్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. పుప్పాల గూడ లో నాలాను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. జీవో 111 నిబంధనలతోపాటు బిల్డింగ్ రూల్స్ 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని ఎన్ జీ టి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, రాజకీయ బలం ఉన్న బడా సంస్థలు డిఎల్ఎఫ్, మైహోం లు నిబంధనలు ఉల్లంఘించాయని పిటిషన్ లో పేర్కొన్నారు.

పిటిషన్ విన్న జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహా డిఎల్ఎఫ్, మైహోమ్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజినల్ ఆఫీసర్, చెరువుల పరిరక్షణ కమిటీ లతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి..రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్14న జరగనుంది.

Next Story
Share it