క్రిష్..పవన్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
BY Telugu Gateway2 Sep 2020 8:32 AM GMT
X
Telugu Gateway2 Sep 2020 8:32 AM GMT
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బుధవారం నాడు పండగలానే ఉంది. ఎందుకంటే ఉదయం వకీల్ సాబ్ మోషన్ పోస్టర్..మధ్యాహ్నాం పీఎస్ పీకె ఫస్ట్ లుక్. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా చారిత్రక కథ ఆధారంగా తెరకెక్కుతుందనే సంకేతాలు ఇఛ్చేలా పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు క్రిష్ ఈ లుక్ ను విడుదల చేశారు.
అంతే కాదు..ఈ సినిమా షూటింగ్ లో 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని..అది అంతా టీమ్ ముందు ఓ జ్ణాపకంగా మెదులుతోందని అన్నారు. మీరు ఎప్పటిలాగానే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని క్రిష్ తన మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story