Telugu Gateway
Cinema

‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ విడుదల

‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ విడుదల
X

కరోనా టైమ్ అంతా ఓటీటీల సీజన్ గా మారింది. చిన్న, మధ్యతరహా సినిమాలు అన్నీ కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇఫ్పుడు ఆ జాబితాలో ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడ చేరింది. ఈ సినిమా అక్టోబర్ 2న ‘ఆహా’ ఒటీటీలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇందులో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్ లు నటించారు. ఈ ట్రైలర్ సరదా సరదాగా సాగింది. ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో, కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్ అందించారు. ‘మీకు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ లక్స్ సోప్ లాంటి వాడు. ఒళ్లంతా రాసుకుంటారు. బ్రేక్ అయిన తర్వాత మాత్రం డెట్టాల్ సోప్ లా చేతులు కడుక్కోవటానికి మాత్రమే వాడతారు’ అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తుంది.

https://www.youtube.com/watch?v=OysGpn9fWM0

Next Story
Share it