Telugu Gateway
Cinema

‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల

‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల
X

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. థియేటర్లు ఓపెన్ అవుతాయి..అక్కడే సినిమా విడుదల చేద్దామని నెలల పాటు వేచిచూస్తున్న చిత్ర యూనిట్ కు ఈ విషయంలో నిరాశే ఎధురైంది. దీంతో అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు రంగం సిద్ధం అయింది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా సోమవారం నాడు ట్రైలర్ విడుదల చేశారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర ట్రైల‌ర్‌ను హీరోలు రానా ద‌గ్గుబాటి, విజ‌య్ సేతుప‌తి ట్విట్ట‌ర్ ద్వారా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అనుష్క బెస్ట్ ప్రెండ్ పాత్ర‌లో షాలిని పాండే న‌టించారు. ఓ హత్య‌కేసులో నిందితురాలిగా షాలినిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూగ‌, చెవిటి అమ్మాయిగా ఉన్న అనుష్క సాక్ష్యం ఈ కేసులో కీల‌కంగా మార‌నుంది. మాధవన్‌, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే సన్సెన్స్ కొన‌సాగేలా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. సినిమాలో హాలీవుడ్‌ నటుడు అండ్రూ హడ్సన్‌, హీరోయిన్ అంజలి క్రైమ్ ఆఫీస‌ర్లుగా క‌నిపించారు.

https://www.youtube.com/watch?time_continue=8&v=OOotZ7Q4o8w&feature=emb_logo

Next Story
Share it